calender_icon.png 23 March, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరుగడ్డపై జాతీయ పురస్కార వేడుక

22-03-2025 05:02:36 PM

నాగబాల సురేష్ కుమార్..

కుమ్రం భీం అసిఫాబాద్, (విజయక్రాంతి): విరోచిత పోరాటానికి ప్రతీకగా నిలచిన కుమ్రం భీం ఆసిఫాబాద్ గడ్డపై జాతీయ పురస్కార అవార్డుల వేడుకను నిర్వహించడం జరుగుతుందని సినీ దర్శక నిర్మాత నాగ బాల సురేష్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవ జ్యోతి సాంస్కృతిక సంస్థ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిందని, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న డైలాగ్ కింగ్ సాయికుమార్ సినీ జీవితం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుమ్రం భీం జాతీయ పురస్కార కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ లో ఆదివారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

భారత్ కల్చరల్ అకాడమీ, ఆదివాసి సాంస్కృతిక పరిషత్, ఓం సాయి తేజ ఆర్ట్స్, నవ జ్యోతి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాయికుమార్ హాజరవడంతోపాటు మాజీ ఐఏఎస్ పార్థసారథి, హాస్యనటులు బాబు మోహన్, శివారెడ్డి, నిర్మాత లు రాహుల్ యాదవ్, విజయ్ కుమార్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకను ఇక్కడ నిర్వహించేందుకు ప్రధాన కారణం ఈ ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం తీసుకురావాలనేదే ప్రధాన ఉద్దేశమన్నారు. భీం వరసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని  ఇందుదకు యువత చైతన్యవంతులు కావాలన్నారు. గిరిజనులను విభజించే కుట్ర జరుగుతుందని గిరిజనులంతా ఐక్యతగా ముందుకు సాగుతూ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు.

ఎంతో చరిత్ర గల అంకుమ రాజు సమాధి గల ఆలయం ఎందుకు అభివృద్ధి జరగడంలేదని ఆవేదన వెళ్లగక్కారు. అవార్డు ప్రధానం సందర్భంగా 200 మంది కళాకారులచే వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. కళామ్మతల్లి సాక్షిగా జరిగే ఈ వేడుకను విజయవంతం చేసేందుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆయా సంస్థల సభ్యులు సిడాం అర్జున్ మాస్టర్, ధర్మపురి వెంకటేశ్వర్లు, సాయిని రాజశేఖర్, అనుమాండ్ల మధు, చంద్రశేఖర్, రాధాకృష్ణ, బాపూరావు తదితరులు పాల్గొన్నారు.