14-02-2025 01:19:05 AM
కామారెడ్డి , ఫిబ్రవరి 13,(విజయక్రాంతి): కామారెడ్డి కర్షక్ బి.ఎడ్ కళాశాలలో సహాయ ఆచార్యులు గా పనిచేస్తున్న డాక్టర్ బాలు ఇటీవలే దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికారడ్స్ మరియు శ్రీ సాయి సేవా భగవాన్ ఉత్తమ జాతీయ సేవా పురస్కారం అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని అభినందన సన్మాన కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ కె రషీద్ మాట్లాడుతూ 17 సంవత్సరాల నుండి డాక్టర్ బాలు రక్తదానంలో చేస్తున్న సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయనీ,వ్యక్తిగతంగా 75 సార్లు,తలసేమియా చిన్నారుల కోసం 4500 ల యూనిట్ల రక్తాన్ని, ఇప్పటివరకు 25 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కిషన్,బీమా గౌడ్,మమత,తయిబా,సూపరిడెంట్ నర్సింలు,బాబు రావు,చాత్రో ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.