వైద్యసిబ్బందిని సన్మానించిన ఎమ్మెల్యే
పటాన్‌చెరు, నవంబర్ 29: నియోజకవర్గ కేంద్రం పటాన్‌చెరులోని టంగుటూరి అంజయ్య ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఉత్తమ సేవల విభాగంలో జాతీయ స్థాయి అవార్డు కైవసం చేసుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సెంట్రల్ క్వాలిటీ సూపర్‌వైజర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ సమీక్షలో మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో పటాన్‌చెరు ఏరియా ప్రభుత్వాస్పత్రికి 7వ స్థానం లభించింది.
ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. 2012లో ఆస్పత్రి ప్రారంభించిన నాటి నుంచి నాణ్యమైన సేవలను అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతోందన్నారు.
తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములుగౌడ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పనగేశ్, మాజీ జెడ్పీటీసీ, వైస్ చైర్మన్ ప్రభాకర్, జిల్లా వైద్యాధికారి గాయత్రి, డీసీహెచ్‌ఎస్ అధికారి సంగారెడ్డి, ఎంపీడీవో యాదగిరి, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.