భీమదేవరపల్లి, జూన్ 29: గ్రామీణ ప్రాంతంలో మహిళల సహకారంతో ఏర్పాటు చేసుకున్న ములకనూరు డెయిరీ జాతీయ అవార్డు దక్కించుకున్నది. ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో అన్ని విభాగాల్లో బెస్ట్ ఫర్మార్మెన్స్ అవార్డు అందుకున్నది. శనివారం కేరళలోని కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ఆసియా పసిఫిక్ దేశాల డెయిరీల ప్రతినిధులు బ్రేజెల, అల్కా ఉపాధ్యాయతోపాటు జాతీయ పాడి పరిశ్రమ చైర్మన్ చేతులమీదుగా ములకనూరు స్వకృషి సంఘం డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీకి అవార్డు అందుకున్నారు.