హాజరుకానున్న లక్ష మంది విద్యార్థులు
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్) దేశవ్యాప్తంగా ఈ నెల 4న జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని 3, 6, 9వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరిశీలించేందుకు ఈ సర్వేను నిర్వహించనున్నారు. మన రాష్ట్రం నుంచి దాదాపు 3,340 పాఠశాలల్లోని లక్ష మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి విద్యార్థులను అధికారులు సన్నద్ధం చేశారు. ప్రతీ మూడేళ్లకోసారి న్యాస్‌ను కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తోంది.
గతంలో 2021లో న్యాస్ నిర్వహించగా, ఈసారి పర్ఫామెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ రాష్ట్రీయ సర్వేక్షన్ (పరాస్) పేరుతో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. లాంగ్వెజ్‌లు, సోషల్ స్టడీస్, గణితం ఇతర సబ్జెక్టులపై విద్యార్థుల సామర్థ్యాలను ఈ సర్వేద్వారా అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకును ప్రకటిస్తారు.