న్యూఢిల్లీ, నవంబర్ 12: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నా ట్కో ఫార్మా నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 83 శాతం వృద్ధితో రూ. 676 కోట్లకు చేరింది. నిరుడు క్యూ2లో కంపెనీ రూ. 369 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన క్యూ2 లో నాట్కో ఫార్మా ఆదాయం రూ.1,031 కోట్ల నుంచి రూ. 1,371 కోట్లకు చేరింది. తమ ఫార్ములేషన్స్ ఎగుమతుల్లో పటిష్ట వృద్ధి సాధించామని, దేశీయ ఫార్మాస్యూటికల్ వ్యాపారం స్థిరంగా ఉన్నదని నాట్కో ఫార్మా మంగళవారం తెలిపింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.1.50 చొప్పున ఇంటెరిం డివిడెండు సిఫార్సుచేసింది.