calender_icon.png 2 April, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నాతరి స్వామి

31-03-2025 04:25:47 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బూడిద గడ్డ బస్తి, అశోక్ నగర్ మస్జిద్ ల వద్ద సోమవారం రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలకు టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. కఠిన ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలు ఐక్యత భావంతో ఈ పండుగను జరుపుకోవడం సంతోషకరమన్నారు. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య,మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్, బెల్లంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సన్నీ బాబులు ముస్లింలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.