calender_icon.png 20 April, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్త దాతగా నటరాజ్‌కు మానవతా వీరుడు అవార్డు ప్రదానం

07-04-2025 12:36:40 AM

మహబూబ్ నగర్ ఏప్రిల్ 6 (విజయ్ క్రాంతి) : అత్యధిక సార్లు రక్త దానం చేసి రక్త దాతగా పేరొందిన రెడ్ క్రాస్ ఛైర్మెన్ లయన్ డాక్టర్ అంబటి నటరాజ్ కు జాతీయ స్థాయిలో మానవత వీరుడు( హీరో ఆఫ్ హ్యుమానిటీ) అవార్డు లభించింది. జిల్లా రక్తదాతలు, ప్రేరేపకుల ఫోరం కోరాపుట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదానం పై ఒడిషా రాష్ట్రం (కోరాపుట్ లోని మున్సిపల్ ఆ డిటోరియల్) లో ఈ నెల 5, 6తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కాన్ఫరెన్స్ ముగింపు సందర్భంగా జాతీయ స్థాయిలో వందకు పైగా రక్త దానం చేసిన రక్త దాతలకు మానవత వీరుడు అవార్డులను ప్రదానం చేశారు.

167 సార్లకు పైగా రక్తదానం చేసి సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన రెడ్ క్రాస్ ఛైర్మెన్ లయన్ నటరాజ్ కు మానవత వీరుడు అవార్డును ప్రదానం చేశారు. కోరా పుట్ జిల్లా కలెక్టర్ కీర్తి వాసన్, ఎమ్మెల్యే రఘు రామ్, జిల్లా రక్త దాతల , ప్రేరేపకుల ఫోరం ( డి బి డి యం ఎఫ్) అధ్యక్షులు సంజీవ్, కార్యదర్శి షేక్ ఇబ్రహీం ల చేతుల మీదుగా లయన్ నటరాజ్ మానవత వీరుడు అవార్డు అందుకున్నారు.

అత్యధిక సార్లు రక్త దానం చేయడం తో పాటు గత ఏడాది రాష్ట్ర పతి నుంచి అవార్డు అందుకున్న నేపథ్యంలో  నటరాజ్ సేవలను గుర్తించి జాతీయ కాన్ఫరెన్స్ కు ఆహ్వానించి అవార్డును అందజేయడం అభినందనీయం . కాగా రక్త దాత గా జాతీయ స్థాయి అవార్డు అందుకున్న లయన్ నటరాజ్ ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.