బెంగళూరు: కర్ణాటక నూతన పరిశ్రమల బిల్లు యోచనపై నాస్కామ్ బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కర్ణాటకపై నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ అసంతృప్తి. ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానిక కోటా కల్పించేందుకు కర్ణాటక యోచిస్తుంది.
దీంతో నాస్కామ్ ప్రభుత్వ యోచనను నిరసిస్తూ నోట్ విడుదల చేసింది. రాష్ట్ర అభివృద్ధిలో టెక్ సంస్థలది కీలకపాత్ర అని, ఆంక్షలు విధిస్తే కంపెనీలు తరలివెళ్లే ప్రమాదం ఉందని నాస్కామ్ సూచించింది. కర్ణాటక యోచనపై పరిశ్రమల యజమానులతో చర్చిస్తామని చెప్పింది.
కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థలోని గ్రూప్ సీ,డీ గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ప్రభుత్వం వెనుకడుగు వేసింది. పరిశ్రమ వర్గాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం