calender_icon.png 6 October, 2024 | 4:14 AM

నస్రల్లా వారసుడు హతం!

06-10-2024 01:38:40 AM

ఇజ్రాయెల్ దాడుల్లో సఫీద్దీన్ మరణించినట్లు సమాచారం

ఉత్తర లెబనాన్‌లో హమాస్ మరో కీలక నేత సైతం

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: స్వల్ప వ్యవధిలోనే సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా సహా కీలక కమాండర్లను కోల్పోయిన హెజ్బొల్లాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. నస్రల్లా మరణంతో ఆయన వారసుడిగా భావిస్తున్న హషీమ్ సఫీద్దీన్ కూడా దక్షిణ బీరుట్‌పై శుక్రవారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది.

బీరుట్ శివారులోని దహీ ప్రాంతంలో సీనియర్ హెజ్బొల్లా అధికారుల సమావేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ దాడిలో ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఘనీ సైతం గాయపడినట్లు ఇజ్రాయెల్‌లోని చానెల్ 12 వెల్లడించింది. హషీమ్ జాడ తెలియడం లేదని హెజ్బొల్లా ప్రకటించింది.  

హమాస్ కీలక నేత మృతి

ఇజ్రాయెల్ శనివారం ఉత్తర లెబనాన్‌లో పాలస్తీనా శరణార్థుల శిబిరంపై జరిపిన దాడుల్లో హమాస్ కీలక నేత, అల్‌ఖసమ్ బ్రిగేడ్ సభ్యుడు సయీద్ అతల్లా మరణించాడు. అతనితోపాటు ముగ్గురు కుటుంబస భ్యులు ప్రాణాలు కోల్పోయారు. హమాస్, ఇజ్రాయెల్ మీడియా వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేస్తోన్న దాడుల్లో ఇప్పటివరకు 2 వేల మందికిపైగా మృతిచెందారు. 250 మంది వరకు హెజ్బొల్లాకు చెందినవారే. 

అక్టోబర్ 7న ఇరాన్‌పై దాడి!

ఇరాన్ చేసిన క్షిపణి దాడికి ప్రతీకారంగా గట్టి సమాధానం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్, హెజ్బొ ల్లా, హమాస్ అగ్రనేతలు, అధికారులే లక్ష్యం గా టెల్‌అవీవ్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిం దే.

ఈ దాడుల్లో పశ్చిమ దేశాల సహకారాన్ని కోరాలని ఇజ్రాయెల్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్‌పై హమాస్ అకృత్యాలు చేసిన అక్టోబర్ 7వ తేదీన ఇరాన్‌పై టెల్‌అవీవ్ ప్రతీకారం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతు న్నారు. ఇరాన్‌లో అణు స్థావరాలు, చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుందనే ఊహాగానాలు వస్తున్నాయి. 

అణుస్థావరాలపై దాడి చేయండి: ట్రంప్

ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుందని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. నార్త్ కరోలినాలో జరిగిన ఎన్నికల ప్రచారంలోవ్యాఖ్యానించారు. అణు స్థావరాలపై దాడి గురించి ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఓ విలేకరి ప్రశ్నించగా ఆయన స్పందించలేదు.

దీనిపై మండిపడిన ట్రంప్.. క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇరాన్ అణుస్థా వరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేయాలని, ఆ తర్వాత వాటి గురించి చింతించా లని ట్రంప్ పేర్కొన్నారు. చమురు కేంద్రాలపై దాడికి బదులు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలని బైడెన్ సూచించారు.