12-04-2025 07:52:31 PM
బిజెపి సీనియర్ నాయకులు రఘునాథ్...
మంచిర్యాల (విజయక్రాంతి): సింగరేణి ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నప్పటికీ నస్పూర్ ప్రాంతం అభివృద్ధి మాత్రం చెందటం లేదని బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. బీజేపీ గావ్ ఛలో, బస్తీ ఛలో కార్యక్రమంలో భాగంగా శనివారం నస్పూర్ మున్సిపాలిటీలోని సీతారాంపల్లిలో పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్తీ ఛలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సీతారాంపల్లిలో ముఖ్యంగా డ్రైనేజీ, త్రాగు నీరు, రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని, సింగరేణి ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నప్పటికీ ప్రాంతం అవివృద్ధి మాత్రం చెందటం లేదన్నారు.
ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరుతో పెన్షన్ల పెంపు, మహిళలకు రూ. 2500, విద్యార్థినీలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి 420 హామీలు ఇచ్చి పేద ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆకుల అశోక్ వర్ధన్, జీవీ ఆనంద్ కృష్ణ, సత్రం రమేష్, పానుగంటి మధు, మిట్టపల్లి మొగిలి, ఈర్ల సదానందం, కుర్రె చక్రి, పొనవేని సదయ్య, ఆకుల నరేందర్, జాడి తిరుపతి, మద్ది సుమన్, మాడిశెట్టి మహేష్, కట్కూరి తిరుపతి, దేవేందర్, చల్లా విక్రమ్, రాచకొండ సత్యనారాయణ, గొల్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.