calender_icon.png 22 December, 2024 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత మత్తు పదార్థాలను విడనాడాలి

13-09-2024 08:10:21 PM

ఆదిలాబాద్ కు చేరుకున్న నషా ముక్త్ భారత్ అభియాన్ యాత్ర

ఆదిలాబాద్,(విజయక్రాంతి): యువతను మత్తు పదార్థాల నుంచి విముక్తి చేయడంలో భాగంగా ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ యాత్రను ప్రారంభించినట్లు యాత్ర సమన్వయకర్త బికె మనీషా తెలిపారు. గత నెల 31న కరీంనగర్ నుంచి ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన నషా ముక్త్ భారత్ అభియాన్ యాత్ర శుక్రవారం జిల్లా కేంద్రంకు చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చౌక్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో యాత్ర సమన్వయకర్త బికె మనీషా మాట్లాడుతూ... మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై జిల్లాలోని విద్యా సంస్థల్లో విద్యార్థులకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ అధికారులు, డోవ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఆరోగ్య సమన్వయకర్త బాబులాల్ పాల్గొన్నారు.