calender_icon.png 28 February, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందమామ మీదికి డ్రోన్

28-02-2025 12:00:00 AM

  1. లూనార్ ల్యాండర్ ద్వారా పంపిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్
  2. మార్చి 6న దక్షిణ ధ్రువంపై ల్యాండ్
  3. 2025లో జాబిల్లిపై స్పేస్ ఎక్స్ మూడో ప్రయోగం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: జాబిల్లిపై పరిశోధనలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ గురువారం ఐఎం మిషన్‌ను జాబిల్లిపైకి విజయవంతంగా ప్రయోగించింది. 2025లో జాబిల్లిపై స్పేస్ ఎక్స్ చేసిన మూడో ప్రయోగం ఇది. ఇంట్యుటీవ్ సంస్థకు చెందిన ‘అథీనా’ అనే ఓ లునార్ ల్యాండర్‌ను స్పేస్ ఎక్స్‌కు చెందిన ‘ఫాల్కన్ 9’ ద్వారా జాబిలమ్మ మీదకి పంపింది.

నేడు విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ మార్చి 6న జాబిల్లి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ కానుంది. ఫ్లోరిడా రాష్ట్రంలో ని కేప్ కనవరెల్ నుంచి నాసా స్పేస్ ఎక్స్‌తో కలిసి ఈ ప్రయోగం చేపట్టింది. దీర్ఘకాలం పాటు మానవుడు జాబిల్లి మీద ఉండేలా నాసా చేపడుతున్న కమర్షియల్ లునార్ పేలోడ్ సర్వీసెస్ (సీఎల్‌పీఎస్)కు ఇది కీలకం కానుంది. 

ఎంతో సహాయపడనుంది

ఈ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిన తర్వాత నాసా ట్వీట్ చేసింది. ‘ఇంట్యుటివ్ మెషీన్ ల్యాండర్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. జాబిల్లి మీద వాతావరణం గురించి మరింత అర్థం చేసుకునేందుకు ఈ మిషన్ ఉపయోగపడుతుంది’ అని పేర్కొంది. ఐ ఎం మిషన్‌లో నాసా వివిధ సైంటిఫిక్ పరికరాలను కూడా పంపించింది.

ఇంట్యుటివ్ మిషన్‌కు చెందిన మైక్రో నోవా హపర్, లూనార్ ఔట్ పోస్ట్ మొ బైల్ అటానమస్ ప్రాస్పెక్టింగ్ ప్లాట్‌ఫాం రోవర్స్ ఉన్నాయి. జాబిల్లి మీద నీటి జాడ ఆనవాళ్ల కోసం ఈ మిషన్ అన్వేషించనుంది. సూర్యకిరణాలు పడని జెట్ బ్లాక్ బిలంపైకి ‘గ్రేస్’ అనే డ్రోన్‌ను పంపడం కూడా దీని లక్ష్యాల్లో ఒకటి.