calender_icon.png 21 September, 2024 | 10:16 AM

నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

18-07-2024 12:04:20 PM

హైదరాబాద్: నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నార్సింగి డ్రగ్స్ కేసులో మొత్తం 20 మంది నిందితులు ఉన్నట్లు సమాచారం. నిందితుల్లో ఏడుగురు పెడ్లర్లు, 13 మంది వినియోగదారులున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఏ 10గా  ఉన్నారు. నైజీరియా నుంచి ఢిల్లీ, హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఎబుకా, ఆనౌహ బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతం, వరుణ్ ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. వరుణ్, గౌతం, షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా కింగ్ పిన్ గా నైజీరియాకు చెందిన ఎబుకా సుజి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఎబుకా నుంచి ఆనౌహ బ్లెస్సింగ్ అనే మహిళా ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు అనోహ బ్లెక్సింగ్ 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా హైదరాబాద్ కు డ్రగ్స్ చేరుతున్నాయి. గౌతమ్ ద్వారా రాజమహేంద్రవరం, ప్రకాశం జిల్లాకు డ్రగ్స్ చేరుతున్నాయి. నైజీరియన్ 9 నెలల్లో  గౌతమ్ కు రూ. 10 లక్షలు కమిషన్ గా ఇచ్చినట్లు గుర్తించారు. వరుణ్ నుంచి అమన్ ప్రీత్ సింగ్ కు డ్రగ్స్ సరఫరా అయినట్లు సమాచారం. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలి లోని కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. నిందితురాలు ఆనౌహ బ్లెస్సింగ్ స్నేహితురాలి పేరును తన పేరుగా మార్చుకుంది. ఆనౌహ బ్లెస్సింగ్ మరో పేరుతో పాస్ పోర్టు తీసుకుంది.