29-03-2025 12:56:34 AM
- బంగారు వెండి పతకం సాధించిన మాస్టర్ విహాన్
రాజేంద్రనగర్, మార్చి 28 (విజయక్రాంతి): నార్సింగి ప్రాంతానికి చెందిన బాలుడికి ఆర్చరీ పోటీల్లో బంగారు, వెండి పథకాలు వచ్చాయి. గుంటూరులో జరుగుతున్న 6వ ఎన్టీపీసీ చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలలో నార్సింగి ప్రాంతానికి చెందిన విహాన్ రాజ్ కుందేళ్ళ అండర్-10 బాలల రిజర్వు విభాగంలో బంగారు, రజత పతకాలు గెల్చు కునాడు.
ఈ పోటీల్లో మొత్తం 97 మంది పాల్గొనగా రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ నిలిచాయి. విజేతగా నిలిచిన విహాన్ రాజ్ శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్ లో 4వ తరగతి చదువుతున్నాడు. రోజూ మూడునాలుగు గంటల కఠిన సాధన వల్లే అతడు విజయం సాధించాడని కోచ్ బండి స్వామి తెలిపారు.
ఈ విజయం పట్ల విహాన్ తల్లిదండ్రులతోపాటు పాఠశాల యాజమాన్యం సైతం హర్షం వ్యక్తం చేశారు. అంతకు ముందు అనేక జాతీయ పోటీలలో పాల్గొని 10 పతకాలు - 7 బంగారు, 1 రజత, 2 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు.