24-03-2025 01:14:09 AM
కామారెడ్డి, మార్చి 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావును ఆదివారం క్యాంటన్ పార్క్ ఏరియా లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. లైన్స్ క్లబ్ గవర్నర్ దీపక్ బట్ట చార్జి ఆధ్వర్యంలో నూతన కమిటీ ని ఎన్నుకున్నట్లు మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమానికి చీప్ గెస్ట్‌గా రాజేంద్రప్రసాద్ కోఆర్డినేటర్ ఎస్‌ఎన్ రెడ్డి భీమిలి లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ ప్రతినిధులు నర్సింగరావుకు నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందించి అభినందించారు.