10-04-2025 12:01:14 AM
బాల్కొండ ఏప్రిల్ 09:(విజయ క్రాంతి):తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ద్వారా పౌర (సీనియర్) జర్నలిస్ట్ విభాగంలో ‘అవార్డు‘ ను విజయవాడ లోని తుమ్ముల పల్లి కలాక్షేత్రం లో బహుకరించ నున్నారు.నర్సింగ్ రావు అల్లకోoడ (బాల్కొండ ) పురాతన ఖిల్లా మరియు ప్రభుత్వ భూముల కబ్జాలపై దినపత్రికల్లో ప్రచురిస్తూ న్నందున ఈ అవార్డు రావడం విశేషం.
బాల్కొండ నియోజక వర్గం లోని ప్రజా సమస్యలను అనేక కథనాలు వ్రాస్తూ, ప్రజల్లో సీనియర్ జర్నలిస్టుగా మంచి గుర్తింపు ఉంది, ఇది ఇలా ఉండగ,ప్రతిష్టాత్మక అవార్డు ను సుప్రీం కోర్ట్ 48వ ప్రాధాన న్యాయ మూర్తి ఎస్. వి రమణచే అతున్నత పురాష్కారాన్ని విజయవాడ లోని తుమ్ముల పల్లి కలాక్షేత్రం లో శనివారం రోజున 5వేల నగదు ప్రశాంశ పత్రం మెమోంటో 20 లక్షలా ప్రమాద బీమా పత్రాలు నర్సింగ్ రావు కు అంద జేయ నున్నారు.
అల్లకొండ ఖిల్లాలో చెట్టు, గుట్ట పుట్టలు తిరిగి ఆణువణువూ గాలించిన పిదప బాల్కొండ చరిత్ర వ్రాయడానికి 2014 నుండీ 2024 వరకు ‘ అల్లకొండ ఊరు ఉద్భవం - ఐదు ఆలయాలకు ప్రసిద్ధి ‘ పుస్తకాన్ని రచించారు. జాతీయ స్థాయిలో ఉగాది పురస్కార అవార్డును 2001 మద్రాస్ తెలుగు అకాడమీ ద్వారా తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ సి. రంగరాజన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.