calender_icon.png 30 October, 2024 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లావణ్య స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్న నార్సింగ్ పోలీసులు

13-07-2024 10:10:16 PM

హైదరాబాద్ : సినీనటుడు రాజ్‌తరుణ్‌ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య నార్సింగ్ పోలీసులు ఎదుట శనివారం హాజరయ్యారు. లావణ్య వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. రాజ్ తరుణ్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులకు ఆమెను నటీ మాల్వీ మల్హోత్రా, తన సోదరుడు ఎలా భయపెట్టారో చెప్పింది. తనకు రాజ్ తరుణ్ కు వివాహం అయినట్లు ఉన్న ఆధారాలను బాధితురాలు పోలీసులకు అందజేసింది. దీంతో మళ్లీ విచారణ ఉంటుందని పోలీసులు బాధితురాలికి తెలిపారు.

లవణ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు పేర్కొన్నారు. రాజ్‌తరుణ్ లేకుండా తాను జీవించలేనంటూ  తాను చచ్చిపోతున్నానంటూ లాయర్‌, పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చిన టెన్షన్ పెట్టారు. ముందు లాయర్‌తో కేసు విషయంలో చాటింగ్ చేస్తూ తాను వెళ్లిపోతున్నానంటూ మెసేజ్ చేశారు. మెసేజ్ చేసిన లావణ్య ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నానంటూ చెప్పుకొచ్చారు. ఆ మెసేజ్ చూసిన లాయర్ షాక్ అయి వెంటనేపోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంతలో డయల్ 112 నుంచి కూడా నార్సింగ్ పోలీసులకు మరో సమాచారం వచ్చింది.