calender_icon.png 11 January, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా నర్సింహారెడ్డి బాధ్యతలు

04-07-2024 12:42:47 AM

టీచర్ సంఘాల శుభాకాంక్షలు

హైరదాబాద్, జూలై 3 (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, కమిషనర్‌గా ఈవీ నర్సింహారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరిం చారు. ఈ మేరకు పలు టీచర్ సం ఘాల నేతలు ఆయనను కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యా య సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే హనుమంతరావు, నవాత్ సురేశ్, ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్‌రెడ్డి, సదానందంగౌడ్, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉమాకర్‌రెడ్డి, పర్వతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా శ్రీదేవసేన..

సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌గా శ్రీదేవసేన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీదేవసేన గతంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా పనిచేశారు.