27-03-2025 08:51:17 PM
కొల్చారం (విజయక్రాంతి): ఆపద్బాంధవుడు ఏ ఆపద వచ్చింది నేనున్నాను అంటూ ప్రతినిత్యం నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే మనసున్న మారాజు ఆవుల రాజిరెడ్డి అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ అన్నారు. గురువారం నాడు పీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మండల కేంద్రమైన కొల్చారం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే జన్మదిన కార్యక్రమానికి భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్, ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవన్న గారి శేఖర్, మైనార్టీ విభాగం నాయకుడు సయ్యద్ అక్రమ్, మాజీ సర్పంచ్ లక్ష్మీపతి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండోమెంట్ మాజీ డైరెక్టర్ పంతులు సంగమేశ్వర్, పోతంశెట్టిపల్లి మాజీ సర్పంచ్ నాగరాణి నర్సింలు, గడ్డమీద శ్రీను, డాక్టర్ బాలరాజ్, నాగరాజు, నాగం రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.