09-03-2025 08:43:52 PM
కొండపాక: కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో సిసి రోడ్డు పనులను మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి ఆదివారం ప్రారంభించారు. దుద్దెడ, రాంపల్లి గ్రామాల్లో సిసి రోడ్డు పనులను ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో కనీస వసతుల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వాసరి లింగరావు, నాయకులు ఆనంతుల నరేందర్, కోయడ వెంకటేశం, సుదర్శన్, పర్శరాములు, కొమ్ము మల్లికార్జున్, సురేందర్, శ్రీకాంత్, సురేందర్, అంబటి రాజు, అంజయ్య, సిద్దులు తదితరులు పాల్గొన్నారు.