- ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్‌లో పోరాడి ఓడిన ధీరజ్
- కాంస్య పతక పోరులో భారత్ ఓటమి
పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో భారత్ తృటిలో పతకం కోల్పోయింది. మిక్స్‌డ్ విభాగంలో ధీరజ్, అంకిత జోడీ సెమీస్ వరకు దూసుకొచ్చి పతకంపై ఆశలు రేపారు. సెమీస్‌లో ఓడినప్పటికీ కాంస్య పతక పోరులో గెలిచి 36 ఏళ్ల ఎదురుచూపులకు తెర దించుతారనుకుంటే నిరాశే ఎదురైంది. దీంతో ఆశలన్నీ మహిళల ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి, భజన్ కౌర్‌లపైనే ఉన్నాయి.
పారిస్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో ఆర్చరీలో భారత్‌కు తృటిలో కాంస్యం పతకం చేజారింది. ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో శుక్రవారం జరిగిన కాంస్యం పోరులో భారత్ 2 తేడాతో అమెరికా చేతిలో పరాజయం చవిచూసింది. తెలుగు ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర జోడీ 37 35 38 35 కాసీ కాఫ్‌హోల్డ్ ఎలిసన్ (అమెరికా) జంట చేతిలో ఓటమి పాలైంది. సెమీస్ వరకు మంచి ప్రదర్శన ఇచ్చిన అంకిత.. కీలక సెమీస్‌లో, ఆపై కాంస్యం పోరులో గురి తప్పింది.
ధీరజ్ 10 పాయింట్లు స్కోరు చేసినప్పటికీ.. అంకిత మాత్రం ఎక్కువగా 7పాయింట్లకే పరిమితమైంది. కాంస్యం పోరులో తొలి రెండు సెట్లలో ఓడి 0 వెనుకబడిన ధీరజ్ జంట మూడో సెట్‌లో ఫుంజుకొని ఇద్దరు 10 పాయింట్లు స్కోరు చేయడంతో మళ్లీ రేసులోకి వచ్చినట్లే అనిపించింది. కానీ నాలుగో సెట్‌లో అంకిత మరోసారి నిరాశపరచడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. అమెరికా జోడీ కాంస్యం కైవసం చేసుకుంది. ఇక గోల్డ్ మెడల్ పోరులో కొరియా జట్టు 6 జర్మనీని చిత్తుగా ఓడించి స్వర్ణం గెలుచుకుంది. అంతకముందు సెమీస్‌లో కొరియా చేతిలో 6 భారత్ పరాజయం పాలైంది.
ఇక క్వార్టర్స్‌లో స్పెయిన్‌పై 3 గెలిచిన ధీరజ్ జంట తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. దీంతో ఒలింపిక్స్ ఆర్చరీ మిక్స్‌డ్ చరిత్రలో భారత్ సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక విశ్వక్రీడల్లో ఆర్చరీ నుంచి ఇద్దరు మాత్రమే మిగిలారు. మహిళల ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి, భజన్ కౌర్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఇద్దరిలో కనీసం ఒకరైనా ఒలింపిక్స్‌లో పతకం తీసుకురావాలని ఆశిద్దాం.