09-04-2025 05:03:06 PM
మునుగోడు (విజయక్రాంతి): నమ్ముకున్న ఆశయం కోసం చివరి శ్వాస వరకు తన జీవితమంతా పోరాటాలతో సమస్యలతో కూడుకున్నప్పటికీ ఎత్తిన ఎర్రజెండా దించకుండా పోరాటాలు నిర్వహించిన యోధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్ర రాఘవరెడ్డి అని సిపిఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ అన్నారు. బుధవారం నర్రా రాఘవరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ప్రజా ప్రతినిధి అంటే నర్ర రాఘవరెడ్డి లాగా ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, మాటలు చెప్పకుండా కాలం కాలయాపన చేయకుండా ప్రజలకు పనిచేసే విధంగా ఉండాలని అన్నారు. ఫ్లోరైడ్ విముక్తి పోరాటంలో, ఎస్ఎల్బీసీ సొరంగంకై సాగిన పోరాటంలో నర్రా రాఘవ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాన్ని తరిమికొట్టేందుకు నర్రా రాఘవరెడ్డిని ఆదర్శంగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, యాసరాణి శ్రీను, వేముల లింగస్వామి, యాట యాదయ్య, నరేష్ ఉన్నారు.