calender_icon.png 23 February, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల గురించి ఒక మంచి కథతో నారి

23-02-2025 12:36:54 AM

మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు సూర్య వంటిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘నారి’. ప్రొడ్యూసర్ శశి వంటిపల్లి నిర్మించిన ఈ సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలాంటి మంచి ప్రయత్నం చేయడం సంతోషకరం’ అన్నారు. ఆమని మాట్లాడుతూ..- ‘మహిళ జీవితంలో పుట్టినప్పటినుంచి అన్నీ కష్టాలే. అది అర్థం చేసుకున్న వాళ్లు కొద్దిమందే. సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ మూవీ’ అన్నారు.

దర్శకుడు సూర్య  మాట్లా డుతూ.. ‘మా మూవీలో ఒక మహిళ జీవితాన్ని మూడు దశల్లో చూపిస్తున్నాం. ‘నారి’ లాంటి మూవీ చేశానని నా జీవితంలో గర్వంగా చెప్పుకోగలను” అన్నారు. నిర్మాత శశి  మాట్లాడుతూ..- “నారి’ మహిళల కోసం చేసిన మూవీ. అయితే ప్రేక్షకులంతా సకుటుంబంగా చూసేలా ఉంటుంది” అన్నారు.