10-02-2025 06:15:44 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల మాల మహానాడు నూతన అధ్యక్షుడిగా వేర్పుల నరేష్ ఎన్నికయ్యారు. సోమవారం మాల మహానాడు ముఖ్య కార్యవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బూర్గుల సతీష్, గౌరవాధ్యక్షుడిగా మద్దెల భద్రయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్గా దాసరి వెంకట్, వేల్పుల సురేష్ లతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. మాలల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడతామని, మాలలకు ఏ సమస్య వచ్చినా ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వేమూరి రవి, పప్పుల ప్రసాద్, చింతమల్ల రమేష్, తోట ప్రసాద్, చెలికాని రామకృష్ణ, బాబురావు (బాబి), దాసరి ఏసురత్నం, కందుకూరి యాకోబు, గుడిశాల నాగమల్లు, వేర్పుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.