21-02-2025 01:02:12 AM
* కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక
* రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కరీంనగర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలు, మనందరిదని రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం కరీంనగర్ లోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యాప్రమాణాలలో మార్పు తీసుకురావాలని అనుకుంటున్న తరుణంలో నరేందర్ రెడ్డి గెలుపు అవసరమని తెలిపారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక అని, పది సంవత్సరాలు అధికారంలో లేకున్నా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్ని అవమానాలు, ఇబ్బందులు పెట్టిన కార్యకర్తలు తట్టుకుని నిలబడ్డారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచా రని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలోనే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు నిర్వహించిందని అన్నారు. ఒక క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధతతో విద్యాసంస్థలను నడుపుతూ వేలాది మంది విద్యా ర్థులను ఇంజనీర్లుగా, వైద్యులుగా తీర్చిదిద్దిన ఘనత నరేందర్ రెడ్డిదని అన్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ను నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల అసెంబ్లీ కో-ఆర్డినేటర్ జంగా రాఘవరెడ్డి, మానకొండూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయ ణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంటరీ నియో జకవర్గం ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు.