calender_icon.png 23 February, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

20-02-2025 01:19:50 AM

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 19: రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావేత్త నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ గా అధిక మెజారిటీతో గెలిపించాలని పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగుల కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల పూర్తి అవగాహన ఉన్న విద్యావేత్త నరేందర్ రెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు. గత శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ప్రశ్నించే గొంతుగా తనను గుర్తించి  అండగా నిలిచి ఆత్మస్థుర్యైన్ని నింపిన విశ్రాంత ఉద్యోగులు ఈసారి నరేందర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.

తాను ఏ హోదాలో ఉన్న ఈ ప్రాంత వాసుల కోసం పనిచేస్తూనే ఉంటారని జీవన్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ సెక్టార్లో గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలలో మాత్రమే కళాశాలలు ఉన్న సమయంలో కళాశాల విద్యను కార్పొరేట్ స్థాయిలో అందుబాటులోకి తెచ్చి, వేలాది మందిని ఉన్నత విద్యావంతులు తీర్చిదిద్దిన వ్యక్తి  నరేందర్ రెడ్డి అని తెలిపారు.

విశ్రాంత ఉద్యోగస్తుల సమస్యలపై తాను రాబోయే శాసనమండలి సమావేశాలలో మరోసారి చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పి ఆర్ సి,  డి ఎ, ఈ హె ఎస్ తదితర అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.