కరీంనగర్, డిసెంబర్ 25 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాదులో నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతూ సమూలమైన మార్పులు తీసుకువస్తున్న రేవంత్ రెడ్డి ని అభినందించారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ర్టంలో ఉద్యోగ కల్పనకై తమ వంతు సహాయా సహకారాలను అన్ని వేళల్లో అందిస్తామని నరేందర్ రెడ్డి తెలిపారు.