జగిత్యాల, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్’రెడ్డి సోమవారం జగిత్యాలలో పర్యటించారు. ఈ మేరకు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్’కుమార్, ఎమ్మెల్సీ జీవన్’రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్, మున్సిపల్ తాజా మాజీ చైర్’పర్సన్ అడువాల జ్యోతిలక్ష్మణ్’లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన గెలుపు కోసం కషి చేయాలని నరేందర్’రెడ్డి వారిని కోరారు.