calender_icon.png 31 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్‌గా నరేందర్‌రెడ్డి

31-10-2024 12:00:00 AM

కరీంనగర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగిన సమావేశంలో అసోసియేషన్ బాధ్యులు నరేందర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఉపాధ్యక్షులుగా ప్రభాకర్, రాజేందర్, సాయింట్ సెక్రటరీగా కందుకూరి శంకర్, సంది రాజిరెడ్డి, శివశంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజ్‌కుమార్, నామ రమేశ్, కోశాధికారిగా దామోదర్, పబ్లిసిటీ సెక్రటరీగా గూడ నరేశ్, సంపత్, జిల్లా కో పవన్ కుమార్, భాస్కర్‌రావు, రమేశ్‌గౌడ్, ప్రవీణ్, వర్కింగ్ సెక్రటరీ రాజేందర్, కృష్ణ, సురేశ్, శ్రవణ్ కుమార్, మహ్మద్ ముస్తాక్, ఆర్ నరేశ్, కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాసరావు, శివప్రసాద్, నాగరాజు, సురేందర్, ఉదయ్‌కుమార్, ఉదయ్ కిరణ్, విజయ్‌కుమార్, శ్రీధర్, తిరుపతి, సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్ ను ఎన్నుకున్నారు.