మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్ ప్రభుత్వ కుట్రేనని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే కుట్ర అంటారా? అని ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఎంపీ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
అక్కడి ప్రజలు ఓటేస్తేనే రేవంత్ సీఎం అయ్యారని, ఫార్మా సిటీ కోసం రైతులను ఒప్పించి భూములు సేకరించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. సీఎం సోదరు డు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, ఎంపీ అరుణను అక్కడికి వెళ్లనివ్వలేదని దుయ్యబట్టారు. తిరుపతిరెడ్డి 200 వాహనా ల్లో తిరిగేందుకు పోలీసులు ఎలా అనుమతిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.