04-04-2025 12:42:44 AM
బ్యాంకాక్, ఏప్రిల్ 3: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ గురువారం థాయ్‌లాండ్‌కు వెళ్లారు. 6వ బిమ్‌స్టెక్ శిగరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోదీకి బ్యాంకాక్‌లో థాయ్ ప్రభు త్వం గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రవాస భారతీయులను కలిసి థాయ్ రా మాయణ ప్రదర్శనను వీక్షించారు.
అనంతరం భారత ప్రతినిధి బృందంతో కలిసి థాయ్‌లాండ్ ప్రధాని షిటోంగ్‌టార్న్ షినవత్రాతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబం ధాలపై చర్చించారు. పలు అవగాహన ఒ ప్పందాలపై సంతకాలు చేశారు. సమావేశం అనంతరం షినవత్రా, మోదీలు సంయుక్త సమావేశం నిర్వహించారు.
మోదీ మాట్లాడుతూ.. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, థాయ్ లాండ్ మధ్య పర్యాటకం, సంస్కృతి, విద్యారంగాల్లో సహకారానికి ప్రాధాన్యత ఉందన్నారు. మోదీ పర్యటనను పురస్కరించుకొని 18వ శతాబ్దపు రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా స్మారక స్టాంపును విడుదల చేశారు.
ఈ సందర్భంగా మోదీ థాయ్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక బిమ్‌స్టెక్ కూటమి నాయకులతో కలిసి మోదీ సముద్ర సహకార ఒప్పందాలను పర్యవేక్షించనున్నారు. థాయ్‌లాండ్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ శ్రీలంక బయల్దేరి వెళ్లనున్నారు.