26-04-2025 05:54:22 PM
కరీంనగర్ (విజయక్రాంతి): విఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత స్విమ్మింగ్ శిబిరాన్ని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి(Alphores Chairman Narender Reddy) శనివారం సందర్శించి నిర్వహిస్తున్న తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యతో పాటు విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన కల్పించి వాటిలో నైపుణ్యం సాధించే విధంగా వనరులను అందజేయాలని తద్వారా వారు విజయాలను సొంతం చేసుకుంటారని అన్నారు. విఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.