calender_icon.png 22 February, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

22-02-2025 01:58:26 AM

 కరీంనగర్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి):  క్రీడాకారులు, వాకర్స్, యువకులు,  గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు.  శుక్రవారం ఉదయం కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్లతో కలిసి వెలిచాల రాజేందర్ రావ్ వాకర్స్ ను కలిసి నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ విద్యావేత్త నరేందర్ రెడ్డిని గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తారని, పిల్లల ఫీజులో రాయితీ, పేద పిల్లల విద్యార్థులకు ఉచిత విద్యాబోధన అందిస్తారని తెలిపారు. కరీంనగర్లో అందుబాటులో ఉండే నరేందర్ రెడ్డి కి అందరూ అండగా నిలవాలని కోరారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరింత ధైర్యం కల్పించాలని సూచించారు.

తద్వారా మరింత రెట్టింపు ఉత్సాహంతో కరీంనగర్ ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రాబోయే ఐదు రోజులపాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వాడవాడను ప్రతి గ్రాడ్యుయేట్ ను కలిసి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేలా కష్టపడి పనిచేయాలని రాజేందర్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున రాజేందర్, ఆకుల నరసన్న, మాచర్ల ప్రసాద్, పులి ఆంజనేయులు, పత్తేం మోహన్, టేలా భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.