calender_icon.png 26 February, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

26-02-2025 01:36:17 AM

కరీంనగర్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డికి అన్ని వర్గాల మేధావులు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ సలహాదారులు జ శ్రీ హర్కార వేణు గోపాల్ రావుజ పిలుపునిచ్చారు. ఈ మేరకు రామగుండం ఎన్టీపీసీ లోని ఏవీ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం శ్రీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు జిల్లా మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో బలపరిచిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు.

ఈ ప్రాంతంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేసి అందరికీ సుపరిచితులైన ఆయనకు అవకాశం కల్పించాలన్నారు. తద్వారా విద్యారంగ, నిరుద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే నాలుగు ఉమ్మడి జిల్లాలలో మంచి స్పందన వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పదవిలోకి వచ్చి 14 మాసాలలో సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రాష్ర్ట వ్యాప్తంగా తక్కువ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇదే క్రమంలో రాష్ర్ట వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.