calender_icon.png 15 November, 2024 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

15-11-2024 12:45:41 AM

వికారాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): లగచర్ల దాడుల కేసులో ఏ1 నిందితుడిగా అరెస్టున మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తరఫు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. గురువారం పిటిషన్‌ను పరిశీలించిన వికారాబాద్ జిల్లా న్యాయస్థానం విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

అనంతరం కోర్టు బయట బీఆర్‌ఎస్ లీగల్ సెల్ న్యాయవాది శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నరేందర్‌రెడ్డి బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేశామని, మున్ముందు ఈ కేసులో అరెస్టున రైతులకూ న్యాయ సాయం అందిస్తామని, వారి కోసం కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తామని ప్రకటించారు.