10-04-2025 11:35:22 AM
న్యూఢిల్లీ: ముంబయి ఉగ్రదాడి(Mumbai terror attack accused) కేసు నిందితుడు తహవుర్ రాణా(Tahawwur Rana case) ఇవాళ భారత్ కు రానున్నాడు. కేసు వాదించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(Special Public Prosecutor) ను నియమించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కేంద్ర హోంశాఖ అడ్వకేట్ నరేందర్ మాన్ నియామకం అయ్యారు. నరేందర్ మాన్ ఎన్ఐఏ తరుఫున వాదించనున్నారు. గురువారం మధ్యాహ్నం తర్వాత తహవ్వుర్ రాణా ఢిల్లీకి చేరుకోనున్నారు. నిన్న ప్రత్యేక విమానంలో రాణాను అమెరికా అధికారులు భారత్ కు పంపించారు.
భారత్ కు రాగానే తహవ్వుర్ రాణాను ఎన్ఐఏ అధికారులు(NIA officials) అరెస్ట్ చేయనున్నారు. అనంతరం పటియాల హౌస్ కాంప్లెక్స్ ఆవరణలోని ఎన్ఐఏ ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చనున్నారు. రిమాండ్ విధించాక తహవ్వుర్ రాణాను తిహార్ జైలుకు తరలించే అవకాశముంది. పాలం విమానాశ్రయం, పాటియాలా హౌస్ కోర్టు, తిహార్ జైలు వద్ద భారీగా బలగాలు మోహరించాయి. తీహార్ జైలు(Tihar Prison Complex )లో అత్యంత భద్రత కలిగిన బ్యారక్ లో రాణాను ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా అనుమతితో విచారణ నిమిత్తం రాణాను భారత్ కు ప్రత్యేక విమానంలో తీసుకువస్తున్నారు. తహవ్వుర్ రాణాను ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్(NIA Headquarters) కు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తరలిస్తారని సమాచారం.