calender_icon.png 2 November, 2024 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ @ రూ.602 కోట్లు

29-04-2024 12:23:50 AM

గుజరాత్ తీరంలో 86 కిలోల మాదక ద్రవ్యాలు పట్టివేత

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 : గుజరాత్ తీరంలో మరోసారి మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఆదివారం సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో 14 మంది పాకిస్థానీయులను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.602 కోట్ల విలువైన 86 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ జరిగే సమయంలో తప్పించు కునేందుకు ప్రయత్నించిన పాకిస్థానీయులు భద్రతా సంస్థల అధికారు లపైకి బోట్‌ను ఎక్కించే ప్రయత్నం చేయగా.. అధికారుల కాల్పులు జరిపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విచారణ చేపడుతున్నారు. భద్రతా సంస్థలు గత రెండు రోజులుగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు సమీపంలో భారత ప్రాదేశిక జలాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారు పట్టుబడ్డారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నిషేధిత డ్రగ్ మెఫిడ్రెన్‌ను తయారు చేసే మూడు ప్రయోగశాలలను ఎన్‌సీబీ గుర్తించి, ఈ విషయానికి సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.