calender_icon.png 23 November, 2024 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొరియర్ ద్వారా నార్కోటిక్ డ్రగ్స్ దందా

23-11-2024 01:37:29 AM

మాటువేసి పట్టుకున్న డీసీఏ, 

ఎస్టీఎఫ్, ఎక్సైజ్ అధికారులు

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): గుట్టుచప్పుడు కాకుండా కొరియర్ ద్వారా నార్కోటిక్ డ్రగ్స్, నకిలీ యాంటీ బయోటిక్స్ సరఫరాను డ్రగ్స్ కంట్రోల్, ఎస్టీఎఫ్, ఎక్సుజ్ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో ఛేదించారు. యూపీ నుంచి తెలంగాణకు నార్కోటిక్ డ్రగ్స్‌ను రవాణా చేస్తున్న ముఠాను శుక్రవారం మాటువేసి అధికారులు పట్టుకున్నారు. రాష్ర్టంలో ఇప్పటికే పలు నకిలీ డ్రగ్స్ కేసుల్లో నిందితుడైన గాండ్ల రాములు, ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన మునిశేఖర్ సహకారంతో యూపీ నుంచి తెలంగాణకు నకిలీ యాంటీబయాటిక్స్‌ను రవాణా చేస్తుండగా పక్కా సమాచార  ంతో అరెస్ట్ చేశారు.

స్వాధీనం చేసుకున్న నకిలీ యాంటీబయాటిక్స్ విలువ రూ.6.91 లక్షలని అధికారులు తెలిపారు. బాలానగర్‌లో ఉన్న తిరుపతి కొరియర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై అధికారులు దాడులు చేయగా, యూపీలోని ప్రయాగ్‌రాజ్ శ్రీ ఫార్మా నుంచి అందుకున్నట్లు అందులో తెలిసింది. కొరియర్‌ను శివ్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, ఐడీపీఎల్ కాలనీ, ఆదర్శ్‌నగర్, హైదరాబాద్ చిరునామాకు పంపారు. యూపీ నుంచి వచ్చిన కొరియర్ డెలివరీపై అధికారులు నిఘాపెట్టగా కర్మన్‌ఘాట్ వద్ద గాండ్ల రాములుకు అందిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ డ్రగ్స్‌ను ప్రొద్దుటూ రుకు చెందిన మునిశేఖర్ ద్వారా రాములు కొనుగోలు చేసినట్లుగా విచారణలో తెలుసుకున్న అధికారులు ఇద్దరినీ అరెస్టు చేశారు. కరీంనగర్‌కు చెందిన కుమార్, కర్నూలుకు చెందిన భాస్కర్‌లకు విక్రయించేందుకు నకిలీ డ్రగ్స్‌ను తెప్పించినట్లుగా అధికారుల విచారణలో బయటపడింది.