16-02-2025 12:13:47 PM
ఈదుల తాండవద్దు కనుగొన్న శవం
ముక్కలు ముక్కలుగా నరికేసి చంపిన వైన్యం
మీడియాను అనుమతించని పోలీసులు.
సంఘటన స్థలం వద్ద పోస్టుమార్టం నారాయణఖేడ్
నారాయణఖేడ్: నారాయణఖేడ్ పరిధిలోని నిజాంపేట మండలంలో సంచలంగా మారిన హత్య కేసు మిస్టరీ పోలీసులు ఆదివారం ఉదయం చేదించారు. నీకన్నా తండాలో తన కూతురుతో చనువుగా ఉంటూ ప్రేమిస్తున్నాడని అనుమానంతో దశరథ్ (26) అనే యువకుడిని యువతి తండ్రి గోపాల్ హత్య చేసి శనివారం సాయంత్రం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన సంఘటన సంచలంగా మారగా మృతుని కుటుంబీకులు నారాయణఖేడ్ లో ఆందోళన, ధర్నా చేపట్టడంతో పోలీసులు విచారణ జరిపి హత్య చేసిన సంఘటన స్థలానికి ఆదివారం ఉదయం చేరుకొని చూడగ ఈదుల తాండవద్ద స్థానిక అటవీ ప్రాంతం లోని రాళ్లగుట్టలలో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన వైనం బయటపడింది.
దీంతో పోలీసులు స్థానికులు ఒకసారి షాక్కు గురయ్యారు. సంఘటన స్థలానికి నారాయణఖేడ్ పోలీసులు చేరుకొని తాండ చుట్టుపక్కల ప్రత్యేక పోలీస్ పికెటింగ్ నిర్వహించి హత్యకు పాల్పడ్డ చోటే మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు. హత్య జరిగిన చోటికి పోలీసులు మీడియాను అనుమతించలేదు. ఇంకా వివరాలు వెల్లడి కావల సి ఉంది.