calender_icon.png 20 September, 2024 | 5:14 PM

నారాయణ, నారాయణ...

20-09-2024 02:53:13 PM

కీచక ఉపాధ్యాయుడు.. చితకబాదిన తల్లిదండ్రులు

నారాయణ స్కూల్లో ఘటన

కరీంనగర్,(విజయక్రాంతి): నారాయణ స్కూల్లో కీచక టీచర్ ను చితకబాదిన సంఘటన శుక్రవారం జరిగింది. కరీంనగర్ పట్టణంలోని బ్రహ్మన వీధిలో గల నారాయణ స్కూల్ లో సోషల్ టీచర్ శ్రీనివాస్ అభం శుభం తెలియని అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినులను చెప్పుకోలేని ప్రదేశాల్లో తాకుతు తన కామవాంచను తీర్చుకుంటున్నాడు. సదరు ఉపాధ్యాయుడి చేష్టలతో విసిగిపోయిన పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు స్కూల్ కు చేరుకుని సదరు ఉపాధ్యాయుడిని చితకబాదడంతో నింధితుడు అక్కడి నుండి ఉడాయించాడు. కీచక టీచర్ పారిపోవడంతో ఆగ్రహించిన పేరెంట్స్ స్కూల్ పర్నిచర్ ధ్వంసం  చేసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి  చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు బాధితులను శాంతింపజేసి సదరు ఉపాద్యాడిని చట్టపరంగా శిక్షిస్తామని హమీ ఇవ్వడంతో గోడవ సద్దుమణిగింది.