మచ్చలేని మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబుపై అపనిందలు ఖబర్దార్
ముత్తారం పోలీస్ స్టేషన్లలో నారాయణరెడ్డి పై ఫిర్యాదు
ముత్తారం (విజయక్రాంతి): చల్ల నారాయణరెడ్డి నీకు రాజకీయ భిక్ష పెట్టింది మాజీ స్పీకర్ శ్రీపాదరావు, ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్యలు అన్నారు. ముత్తారంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. నారాయణ రెడ్డి నీకు రాజకీయ బిక్ష పెట్టిన శ్రీధర్ బాబు ను విమర్శించడం విడ్డూరం అన్నారు.
నీవు బహుజన దళితుల భూములను ఆక్రమించుకొని వేల ఎకరాలు సంపాదించి, కాటారంలో ఇల్లు కూడా అసైన్మెంట్ భూమిలో నిర్మించిన నీలాంటి వ్యక్తి శ్రీధర్ బాబు, శ్రీను బాబు లను విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. పుట్ట మధును హత్య చేయమన్నారని నిందలు వేయడం సబబు కాదని, నువ్వు పుట్ట మధు కుటుంబంతో కుమ్మక్కై నీచపు రాజకీయానికి తెరలేపుతున్నావని,ఒకప్పుడు నిన్ను మావోయిస్టులు మట్టు పెడుతామని తెలియడంతో భయపడి నువ్వు హైదరాబాద్ వెళ్లి గజగజమనుకుంటూ శ్రీధర్ బాబు దగ్గర ప్రాధేయపడి ఇద్దరు గన్మెన్లను తెచ్చుకొని లైసెన్స్ రివాల్వర్ పొందింది వాస్తవం కాదా.. నువ్వు పుట్ట మధు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి మా నాయకులపై అవాకు చేవాకులు మాట్లాడితే ప్రజాక్షేత్రంలో నిన్ను శిక్షించడం తప్పదన్నారు.
అనంతరం ముత్తారం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడవేన సంపత్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు అల్లం కుమార స్వామి,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాష, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లేని బుచ్చం రావు, తూటి రజిత రఫీ, తాటిపాముల శంకర్, దాసరి చంద్రమౌళి, కోల విజయ్ తదితరులు పాల్గొన్నారు.