23-03-2025 05:07:33 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడుగా మోత్కూరి నారాయణ గౌడ్ ను సెంట్రల్ కమిటీ కో ఆర్డినేటర్ నసాని రాంచందర్, జోనల్ ఇంచార్జ్ కాదసి రవీందర్ ల సమక్షంలో బిఎస్పీ పార్టీ కండువా కప్పి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలోని స్థానిక చార్వాక మీటింగ్ హల్ నిర్వహించిన సమావేశంలో జాతీయ కమిటీ కో ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ ఆదేశాలతో ఎన్నుకోన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ కో ఆర్డినేటర్ నాసాని రాంచందర్ మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బహుజన సమాజం కోసం పాటు పడే ఏకైక పార్టీ బిఎస్పీ పార్టీ మాత్రమే అన్నారు. బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయమని అన్నారు.
సమాజంలోని అన్ని వర్గాలను ఆదరించే ఏకైక పార్టీ బీఎస్పీ అని వివరించారు. అనంతరం నారాయణ గౌడ్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి తనకు ఇచ్చిన పదవికి తగిన న్యాయం చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజు, ఎలక్షన్ కమిటీ మెంబర్ సిరాజోద్దీన్, నాయకులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, దాగం శ్రీనివాస్, జగన్, కిషన్ రావు, కృష్ణ చైతన్య, తుకారాం, హుస్సేన్, సుందిల్ల అశోక్, చెన్నూరి రాజు, తిప్పరపు రమేష్, విజేయందర్, మహేష్, రాజ్ బాబు తదితరులు పాల్గొన్నారు.