బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటిస్తున్న సినిమా ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ నారా రోహిత్ ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేశారు. అగ్నితో నిండిన టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో రోహిత్ యాక్షన్ -ప్యాక్డ్‌గా కనిపించారు.
ఈ సినిమాలో అతని పాత్ర ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో ఫస్ట్‌లుక్‌తో అర్థం చేసుకోవచ్చు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ చిత్రం ద్వారా స్క్రీన్‌ను షేర్ చేసుకోడం సినీ అభిమానులకు కన్నుల పండగలా ఉండబోతోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: హరి కే వేదాంతం, సంగీతం: శ్రీచరణ్ పాకాల; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్; ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి; డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్; సాహిత్యం: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి; ఫైట్స్: రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ.