నారావారిపల్లెలో అధికారిక లాంఛనాలతో నిర్వహణ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17(విజయక్రాంతి): ఏపీ సీఎం చంద్రబాబునాయుడి సోదరుడు నారా రామ్మూర్తినా యుడి అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఆయన స్వగ్రామమైన తిరుపతి జిల్లా నారావారిపల్లెలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు నటుడు మోహన్‌బాబు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు రామ్మూర్తినాయుడి మృతదేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, రామ్మూర్తినాయుడి కుమారుడు, సినీనటుడు నారా రోహిత్, ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.