calender_icon.png 23 March, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుఫాను వచ్చే ముందు ప్రశాంతత కోసం..

21-03-2025 12:00:00 AM

నాని హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను రచనాదర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడోభాగంగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తోంది. తాజాగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుం చి ఫస్ట్ సింగిల్‌గా ‘ప్రేమ వెల్లువ’ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సాంగ్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌కు ‘మా బృం దం ఈ సాంగ్ ప్లేస్‌మెంట్‌కు ఓ పేరు పెట్టింది..

తుఫాను వచ్చే ముందు ప్రశాంతత’ అనే వ్యాఖ్యను జో డించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మార్చి 24న విడుదల చేయనున్న ఈ రొమాంటిక్ మెలో డీ ట్రాక్.. నాని, శ్రీనిధిశెట్టి మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తుందని వారు పేర్కొన్నారు. మే 1న విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: సాను జాన్ వర్గీస్; సంగీతం: మిక్కీ జె మేయర్.