calender_icon.png 26 February, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జున్ సర్కార్ లాఠీకి దొరికినోడు అంతే..

25-02-2025 12:00:00 AM

నాని కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్3: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ సిరీస్‌లో మూడోభాగంగా రాబోతున్న ఈ చిత్రానికి ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సోమవారం నాని పుట్టినరోజు సందర్భంగా సర్కార్స్ లాఠీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోలీసులను కలవరపెట్టే వరుస రహస్య హత్యల నేపథ్యంలో టీజర్ మొదలవుతుంది.

వారు ఎంత ప్రయత్నించినా హంతకున్ని పట్టుకోవడంలో విఫలమవుతారు. చివరి ప్రయత్నంగా టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటర్ అర్జున్ సర్కార్‌ను ఆశ్రయిస్తారు. నాని అర్జున్ సర్కార్ పాత్రలో ఆదర గొట్టారు. అతని ఇంటెన్స్ ప్రజెన్స్, యాంగర్ టెర్రిఫిక్‌గా ఉన్నాయి. శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి డీవోపీ: సాను జాన్ వర్గీస్; సంగీతం: మిక్కీ జే మేయర్; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్.