calender_icon.png 1 March, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 భాషల్లో గ్లింప్స్!

28-02-2025 12:00:00 AM

శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఓవర్‌నైట్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయారు. తన మరో చిత్రాన్ని కూడా నానితోనే ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. నాని బర్త్ డే సందర్భంగా ‘రా స్టేట్‌మెంట్’ పేరుతో మార్చి 3న స్పెషల్ వీడియో లేదా ఫొటోను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

అయితే నాని బర్త్‌డే రోజు ఇచ్చే అప్‌డేట్ గురించి చిత్ర యూనిట్ సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. మొత్తం 8 భాషల్లో గ్లింప్స్ ఇవ్వనున్నారట. దక్షిణాది భాషలతోపాటు హిందీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ వీడియో ఉంటుందని అంటున్నారు.

పక్కా యాక్షన్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సినిమా.. మాస్‌కు ఫుల్ మీల్స్‌లా ఉంటుందట! ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ‘ది ప్యారడైజ్’ చిత్ర ఓవర్సీస్ రైట్స్‌ను భారీ డీల్‌కు దక్కించుకున్నట్టు కూడా వార్తలొచ్చాయి. పైగా నాని కెరీర్‌లో ఇదే భారీ ఓవ ర్సీస్ డీల్ అని టాక్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే కథానాయికను ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ చిత్రా నికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.