calender_icon.png 24 September, 2024 | 4:47 PM

దసరా కన్నా వంద రెట్లు మిన్నగా నాని ఓదెల 2

20-09-2024 12:57:37 AM

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో నాని మరో మూవీకి సిద్ధమయ్యారు. ఫస్ట్ కొలాబరేషన్ ‘దసరా’తో భారీ వసూళ్లు సాధించిన తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరో భారీ ప్రాజెక్టు కోసం మళ్లీ చేతులు కలిపారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ శ్రీకాంత్ గురువారం సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తించింది. దర్శకుడు శ్రీకాంత్ తాజా పోస్టుతో సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఇటీవల షూట్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో.. దర్శకుడు అద్భుతమైన ప్రోడక్ట్‌ను అందించడానికి సిద్ధమవుతున్నాడని తెలియజేస్తోంది.

దర్శకుడు తాజా పోస్టులో “మార్చి 7, 2023 నా ఫస్ట్ సినిమా ‘దసరా’కు నేను చెప్పిన చివరి కట్, షాట్ ఓకే. సెప్టెంబర్ 18, 2024 ‘నాని ఓదెల2’ అనౌన్స్‌మెంట్ వీడియో కోసం మళ్లీ ‘యాక్షన్’ చెప్పాను. 48,470,400 సెకన్లు గడిచాయి! ప్రతి సెకను నా నెక్స్ట్ ప్రాజెక్టు కోసం సిన్సియర్‌గా ఉన్నాను. దసరా ప్రభావాన్ని 100 రెట్లు క్రియేట్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు.