calender_icon.png 29 December, 2024 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నందులాల్ కుటుంబాన్ని ఆదుకోవాలి

07-09-2024 12:30:11 AM

మంచిర్యాల, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): నేషనల్ హైవే టోల్ ప్లాజాలో ఉద్యోగం చేస్తూ డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బానోత్ నందులాల్ కుటుంబాన్ని నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఆదుకోవాలని సేవాలాల్ సేన నాయకులు కోరారు. శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు గుగులోత్ మల్లేష్ నాయక్ మాట్లాడుతూ.. బానోత్ నందులాల్ కాసిపేట పోలీస్ స్టేషన్ సమీపంలో గల నేషనల్ హైవే టోల్ ప్లాజా వద్ద విధులు నిర్వహిస్తున్నాడని, పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో రామకృష్ణాపూర్ గాంధారీ మైసమ్మ వద్ద గురు వారం రాత్రి 11 గంటలకు ప్రమాదవశాత్తు వాహనం ఢీకొని మృతి చెందాడని చెప్పారు. నందులాల్ కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి పరిహారం, పెన్షన్ ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.